ఇందిరమ్మ చీరల పంపిణీ

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా సాధికారత కోసం "ఇందిరా మహిళా శక్తి" (ఇందిరమ్మ) చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ జనార్ధన్, గుండు చందనా పూర్ణ సుందరన్నారు. ఆదివారం రంగశాయిపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ,గుండు చందనతోపాటు ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ కేడల జనార్ధన్ కాంగ్రెస్ నాయకులు గుండు పూర్ణచందర్ దామరకొండ కరుణాకర్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడు తింటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ఆర్పిలు ఓబీలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

 

Post a Comment

0 Comments