అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తాం..

(జై భారత్ వాయిస్ హన్మకొండ):
అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తాం. అని... హన్మకొండ జిల్లా పరకాల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సేవా దళ అధ్యక్షుడు ఏరుకొండ రవీందర్ గౌడ్ అన్నారు గాంధీ భవన్ లో మాట్లాడుతూగత  ప్రభుత్వం పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేదలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ప్రజలకే అని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం దాదాపు 88,384 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి నెల 1832.06 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. నూతన రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా 18,365 మంది చేరారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత చేరువ చేసేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తాం అని, పాలకుల పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేద మధ్య తరగతి వారు ఇబ్బందులు పడ్డారని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా, అర్హతను బట్టి వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని  తెలిపారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల గృహ జ్యోతి  కింద పంపిణీ చేస్తున్నాము.500 గ్యాస్ పంపిణీ చేస్తున్నాం. మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలో కుట్టుమిషన్ల పంపిణీ చేస్తామన్నారు. ప్రతి పక్ష నాయకులు ఎన్ని ఊసరవెల్లి రాజకీయం చేసిన ఎగిరేది పరకాల గడ్డమీద రేవూరి జెండా చెప్పారు .గత  ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇయ్యకుండా ఏ మొఖం పెట్టుకొని ఓటర్ల దగ్గరికి పోయి  ఓట్ల  అడుగుతారు అని విమర్శించారు.
 ఇప్పటికైనా కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆలోచించి విమర్శలు మానుకొని ప్రజల  గురించి ఆలోచించాలని కోరారు

Post a Comment

0 Comments