పి ఎస్ హెచ్ ఎంల సమస్యలను పరిష్కరించేందుకు కృషి :వరంగల్ జిల్లా అధ్యక్షుడు బి.జయప్రకాష్

(జై భారత్ వాయిస్ న్యూస్ ) వరంగల్ 
 ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పి ఎస్ హెచ్ ఎంల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వరంగల్ జిల్లా  పి ఎస్ హెచ్ ఎం ల అసోసియేషన్ అధ్యక్షుడు బి.జయ  ప్రకాష్ అన్నారు వరంగల్ జిల్లా కేంద్రంలో గౌట్ హైస్కూల్ శంభునిపేటలో జరిగిన పిఎస్ హెచ్ఎంల సభ్యత్వ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ దొనికెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎం ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే ప్రాథమిక పాఠశాలలో బోధ నేతర  పనుల వల్ల విద్యాభివృద్ధి సరిగా జరగడం లేదని అన్నారు. పి ఎస్ హెచ్ ఎంల సమస్యలను ప్రభుత్వానికి నివేదించామని అన్నారు.
 మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలలకు ఒక ప్రత్యేక మండల విద్యాశాఖ అధికారి ఉండాలని ఆయన అన్నారు. ప్రాథమిక పాఠశాలల తనిఖీ పి ఎస్  హెచ్ ఎం లకే అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు హెచ్ ఎం లకు ఆత్మీయ సన్మానం నిర్వహించి మాట్లాడారు. ఈ సభ్యత్వ  కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ దొనికెల శ్రీకాంత్ వరంగల్  జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి పాక విజయకుమార్ అసోసియేట్ అధ్యక్షుడు ముక్కెర పెద్దిరాజు జిల్లా కోశాధికారి కే నరసింహులు ఇంకా సభ్యులు వివిధ మండలాల నుంచి వచ్చిన పి ఎస్ హెచ్ ఎంలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments