బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్యా - జోరుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

 

(జై భారత్ వాయిస్ న్యూస్ - ఆత్మకూరు):
బుజ్జి బుజ్జి గణపయ్య, బొజ్జ గణపయ్య, శరణు గణేశా, శరణాలయ్య అంటూ,
ఆత్మకూరు మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.వాడవాడలా యువకులు, భక్తులు కలిసి చిన్నా పెద్దా గణపతి విగ్రహాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు, వినాయక నామస్మరణతో ఆత్మకూరు మండలం మార్మోగిపోతోంది.పార్వతి తనయ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, గణపతి అష్టోత్తరం, కుంకుమ పూజలు  సాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.ప్రతిరోజు భజనలు,, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో వీధి పందిళ్లన్నీ కళకళలాడుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బొజ్జ గణపయ్యకు మొక్కులు చెల్లిస్తున్నారు.  ఈ క్రమంలో వినాయక ఉత్సవాల్లో డి జె లు పెట్ట వద్దని ఆత్మకూరు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా ఏర్పాటు చేశారు.


Post a Comment

0 Comments