విధుల్లో చేరిన ట్రైనీ ఐఏఎస్ పోతరాజు హరిప్రసాద్-నీరుకుళ్ళ వాసి

(జై భారత్ వాయిస్ న్యూస్  ఆత్మకూరు): హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరు కుళ్ళ గ్రామానికి చెందిన పోతరాజు  హరి ప్రసాద్  శిక్షణలో భాగంగా ట్రైనింగ్ ఐఏఎస్ అధికారిగా కరీంనగర్ కలెక్టరేట్లో విధుల్లో చేరారు. కరీంనగర్ కలెక్టర్ చిత్ర మిశ్రా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని  అందించారు ఐ ఏ ఎస్ శిక్షణ కాలంలో భాగంగా పరిపాలన రెవెన్యూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రయోగిత అవగాహన  పొందేందుకు ట్రైని కలెక్టర్ గా పోతరాజు హరిప్రసాద్ వివిధ శాఖల పరిధిలో పరిశీలించనున్నారు.నిరుకుల్ల గ్రామానికి చెందిన హరి ప్రసాద్ గత సంవత్సరం ఐఏఎస్ కు ఎంపిక కాగా సంవత్సర కాలంగా శిక్షణ లో భాగంగా  కరీంనగర్ కలెక్టరేట్ లో  చేరారు

Post a Comment

0 Comments