అక్కంపేటలో శ్రీరామ హృదయం కార్యక్రమం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట లోని శ్రీ రామాలయంలో శ్రీ రామ హృదయం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య అన్నారు. గ్రామంలో  వికాస తరంగిణి ఆధ్వర్యంలో చిన్న జీయర్ స్వామి జన్మ దిన వేడుకలను పురస్కరించుకొని శ్రీరామ హృదయం కార్యక్రమం జరిగింది. కలశం పూజ నిర్వహించి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనుసంధానం చేశారు. కార్యక్రమంలో వికాస తరంగిణి బాధ్యులు, అక్కంపేట భజన మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments