కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

 

జై భార‌త్ వాయిస్ భాగ్య‌న‌గ‌ర్ 
తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా  హైదార‌బాద్  గాంధీ భవన్ లో ఘనంగా నివాళులర్పించారు.గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన బాపూజీ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవినే తృణప్రాయంగా వదిలి, జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు బాపూజీ అని, ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments