(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరు మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆత్మకూరు మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెలిదే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సామాజిక సేవలు, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పద్మశాలి సమాజం ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసంఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అలాగే తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవా రంగాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా వరంగల్ ఎయిర్పోర్ట్కు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో , జిల్లా కార్యదర్శి ఇరుసడ్ల సదానందం, ఉపాధ్యక్షులు పాపాని రవీందర్, చిమ్మని దేవరాజు, గ్రామ అధ్యక్షులు వడ్డేపల్లి వేణుగోపాల్, వెలిదె సుదర్శన్, యూత్ అధ్యక్షులు మార్త రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు కొంపల్లి రవీందర్, రాజు, రాంబాబు, శంకర్, మాచర్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

0 Comments