ఆత్మకూరు పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు ఆపాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను తప్పనిసరిగా నిలిపి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు కొంపల్లి రవీందర్ డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ వద్ద బస్సులు ఆగకపోవడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను ఆర్టీసీ అధికారులు వెంటనే గుర్తించి పాత బస్టాండ్ వద్ద బస్సులు ఆగేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్య పట్ల డిపో, డివిజనల్, రీజినల్ మేనేజర్ అధికారులు దృష్టికి సారించి తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.పాత బస్టాండ్ వద్ద బస్సుల నిలుపుదలపై అధికారులు సానుకూలంగా స్పందించకపోతే గ్రామస్తులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రవీందర్ హెచ్చరించారు. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments