గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో భ‌జ‌న‌లు

 

జై భార‌త్ వాయిస్ న్యూస్ హ‌న్మ‌కొండ 
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ సుబేదారి లోని శ్రీ వేంకటేశ్వర కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో  ఆదివారం నాడు  పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ,జెన్ z బీటెక్ పిల్లలతో చేసిన‌ భజన్ జామింగ్ సంగీత కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర కాలనీ సభ్యుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుని ప్రతిష్టాపించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమంలో మహిళా భక్తులను పిల్లలని ఆకట్టుకునే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను నలుగురికి తెలియపరిచే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని పలువురు కాలనీవాసులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ, సరస్వతి పూజ, గణపతి హోమం ,సహస్రదీపాలని కరణ, మహా నైవేద్యం (116)లాంటి కార్యక్రమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్వరాలయం సంస్థ వారి భజన్ జామింగ్ పలువురిని    పలువురిని ఎంతో ఆకట్టుకుంది . చకిలం సహస్ర , మనోజ్ వారి భక్తి పాటలతో , భజన కార్యక్రమాలతో అందరినీ ఎంతో అలరించి ఒక భక్తి భావాన్ని తీసుకొచ్చారని  పలువురు కాలనీ ప్రముఖులు కొనియాడారు. ఇందులో భాగంగా చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు  పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో  వేముల రవికుమార్ ., మెరుగు శివ రవీందర్ రెడ్డి,  గంభీర్ రెడ్డి , శాంసుందర్, ధర్మానాయక్, భాస్కర్ తదితరులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు





Post a Comment

0 Comments