జై భారత్ వాయిస్ న్యూస్: గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఘనంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.. స్థానిక ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ నమ్రత, హైస్కూల్ హెడ్మాస్టర్ సుభాష్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సువిశాలమైన పాఠశాల మైదానంలో దాదాపు వంద మొక్కలు నాటడం జరిగింది.ఈసందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ప్రెసిడెంట్ అనంతుల కుమారస్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్రస్తుత ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మనమంతా విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని తద్వారా భావితరాలకు వారసత్వంగా ఆహ్లాదకరమైన వాతావరణం అందజేయాలని పిలుపునిచ్చారు. తమ రోటరీ క్లబ్ సభ్యులు, స్థానిక సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ సూచన మేరకు గతంలో ఈ పాఠశాలకు దాదాపు 2లక్షల రూపాయల విలువైన డెస్క్ బెంచీలను అందజేశామని, లక్ష్మీనారాయణ తన స్వంతంగా లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన సువిశాలమైన క్రీడా మైదానంలో ప్రస్తుతం తాము మొక్కలు నాటడం జరిగిందని, మున్ముందు గ్రామస్తులు సహకరిస్తే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈకార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ప్రోగ్రాం కన్వీనర్ మామిడాల రమేష్ బాబు, కో-కన్వీనర్ జల్లిపల్లి మురళీధరాచారి, రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు ఎల్లంకి రాజయ్య, మామిడాల సుధాకర్, తోట వెంకట నాగరాజు, పుస్కూరి ధర్మేంద్ర, గ్రామ ఉపసర్పంచ్ కోట ప్రమోద్, స్థానికులు కర్ణకంటి రాంమూర్తి, రామా కుమారస్వామి, బండారి నరేందర్ మరియు ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు విజయలక్ష్మి, దివ్య, వెంకటరమణ, జ్యోత్స్న ప్రభ, శ్రీనివాస్, రమేష్ బాబు, నాన్ టీచింగ్ స్టాఫ్ రజిత, నర్సయ్య, శంకర్, స్వరూప గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments