ఆటలతోనే అభ్యాసానికి బాట: కలెక్టర్ సత్యశారద కరీంబాద్ ప్రీ-ప్రైమరీ విభాగం సందర్శన

జై భార‌త్ వాయిస్ న్యూస్   వరంగల్:

చిన్నారులకు ఆటలు, పాటలు, కథల ద్వారా బోధన అందిస్తే నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి సమగ్ర వికాసం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం జీపీఎస్ కరీంబాద్ లోని ఫ్రీ ప్రైమరీ   పాఠశాలను  సందర్శించి బోధన–అభ్యాస కార్యక్రమాలను పరిశీలించారు.ప్రీ-ప్రైమరీ తరగతుల్లో ప్లే వే మెథడ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, బోధన–అభ్యాస సామగ్రి (టీఎల్‌ఎం) వినియోగం, చిన్నారుల భాగస్వామ్యాన్ని పరిశీలించిన కలెక్టర్.. చిన్నారులతో మమేకమై వారితో మాట్లాడారు.అనంతరం పిల్లలతో కలిసి జిల్లా కలెక్టర్  రైమ్స్ చెప్పిస్తూ ఉత్సాహపరిచారు.ప్రతి ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ప్లే వే మెథడ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, టీఎల్‌ఎం వినియోగంతో ఆనందదాయకమైన అభ్యాస వాతావరణాన్ని కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, డీఈఓ రంగయ్యనాయుడు, ఖిలా వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ, ప్రధానోపాధ్యాయులు జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments