పరకాల లో బిజెపి కి ప్రజలు పట్టం కడతారు -జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
రానున్న రోజులలో పరకాలలో  బిజెపికి ప్రజలు పట్టం కడతారని జాతీయ బిజెపి కౌన్సిల్ సభ్యులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు ఆత్మకూరులోబీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్ తో కలిసి మాట్లాడారు గతంలో పరకాల భూపాలపెళ్లి నియోజకవర్గంలో బిజెపి పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు గత ప్రభుత్వం టిఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలను చేయలేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమాన్ని మరిచిందని ఆరోపించారు వర్షాలు లేక రైతులు అనేక అవస్థలు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ప్రభుత్వం రైతులకు బోనస్ మరిచిన దని విమర్శించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గట్టికొప్పుల రాంబాబు, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు రాయరాకుల మొగిలి, గుజ్జుల మహేందర్ రెడ్డి  ఆత్మకూరు మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి  శాయంపేట మండల అధ్యక్షులు రామకృష్ణ, బిజెపి సర్పంచి  భూతాని  దివ్యతిరుపతి ,మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments