ఆర్ట్స్ కళాశాలలో కాళోజీ జయంతి వేడుక!

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ 
ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ సాధన ఉద్యమ నేత కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుంకరి జ్యోతి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆచార్య సుంకరి జ్యోతి మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తన జీవితమంతా ప్రజల సమస్యలపై పోరాడిన గొప్ప ప్రజాకవి అని అన్నారు. సామాజిక అసమానతలు, అన్యాయం, నిరంకుశత్వంపై తన కలం ద్వారా నిరంతరం ప్రశ్నించిన కాళోజీ భావజాలం నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే ధైర్యాన్ని, సామాజిక బాధ్యతను యువత అలవర్చుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజల ఆత్మగౌరవం కోసం కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.

Post a Comment

0 Comments