(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.ఆత్మకూరు మండలం లింగమడుగు పల్లి, కామారం, గుడెప్పాడ్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి, లబ్ధిదారులకు శాలువాతో సన్మానించి, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
0 Comments