ఉద్యోగులకు పి అర్ సి వెంటనే ప్రకటించాలి
(జై భారత్ వాయిస్ వరంగల్ )
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలని రాష్ట్ర పీ ఆర్ టి యు నాయకులు భూక్య వీరన్న డిమాండ్ చేశారు. మంగళ వారం హైదరాబాదులో జరిగే మహాధర్నాకు , ఖానాపూర్ ,నర్సంపేట మండలాల నుంచి టీచర్లు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సందర్భంగా మంగళ వారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గత మూడేళ్లుగా పిఆర్సిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 33 నెలలుగా ఆరు డిఏలు పెండింగ్లో ఉన్న కూడా ఇంత వరకు జాడలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తున్న వేతనాల నుంచి ప్రతినెల 1. 5 శాతం కట్ చేసినా కూడా ఈ హెచ్ ఎస్ కార్డులు అమలు కావడంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హెచ్ఎస్ కార్డులు తీసుకుని హాస్పిటల్స్ కి వెళితే అమలు కావడం లేదని ఆరోపించారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు గ్రాటువిటీ,కమ్యుటేషన్, గ్రంటు జిపిఎఫ్ డబ్బులు సకాలంలో అందడం లేదని ఆరోపించారు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ మండల పి ఆర్ టి యు అధ్యక్ష కార్యదర్శులు అల్వాల భిక్షపతి, జేతురాం నాయక్, జిల్లా నాయకులు బే రె సుధాకర్, జమాండ్ల వెంకన్న, మండల అసోసియేట్ అధ్యక్షుడు ఎల్. రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments