జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని సదాశయ ఫౌండేషన్
ప్రతినిధి గోవిందు కుమార స్వామి కి ఘన సన్మానం
(జై భారత్ వాయిస్ ప్రతినిధి వరంగల్ ):
సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యం లో చేపట్టిన
నేత్ర అవయవ శరీర దానం సేవలను జాయింట్ డైరెక్టర్ నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ కంట్రోల్ బ్లైండ్ నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ NPCB & Vl డాక్టర్ యం. సుపర్ణ ప్రశంసించారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని మంగళ వారం వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్ అధ్యక్షతన హైదరాబాద్ లోని సుందరయ్య,విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి లో, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కాళోజీ గారి నేత్ర దేహదానం స్పూర్తితో 2008 లో ఏర్పడిందని అన్నారు.గత 18సంవత్సరాలుగా నేత్ర అవయవ శరీర దానాలపై చేస్తున్న కృషి మూలంగా ఇప్పటికీ 1645 నేత్రదానాలు, 160 దేహదానాలు, 95 అవయవ దానాలు చేయించడం జరిగిందని వివరించారు.ఈ అంశంపై స్వచ్ఛందంగా కృషి చేస్తున్న సంస్థలకు , దాతల కుటుంబాలకు ప్రభుత్వం సహకారం అందించాలని అలాగే ప్రభుత్వం ప్రతి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎల్ల వేళల్లో నేత్రసేకరణ చేసే టెక్నీషియన్ ను నియమించాలని,ఇందువలన మంచి సత్ఫలితాలు వస్తాయని వివరించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ యం. సుపర్ణ జాయింట్ డైరెక్టర్ నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ కంట్రోల్ బ్లైండ్ నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ NPCB & Vlమాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ గత 18 సంవత్సరాలుగా నేత్ర అవయవ శరీర దానాలపై చేస్తున్న కృషిని కొనియాడారు. త్వరలో ఈ అంశంపై కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్నియల్ అందత్వ నివారణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ కు చెందిన గోవిందు కుమార స్వామి టి.శ్రవణ్ కుమార్, లింగమూర్తి, డాక్టర్ మేరుగు భీష్మాచారి, దీటి వెంకటస్వామి,
ch. దళపతి, కె. శంకర్రావు, , కె.రామచంద్రారెడ్డి,
వి శ్రీనివాస్, క్యాతం మల్లేశం, డాక్టర్ వేణు, ఎల్. రాజమౌళి, కె.సమ్మయ్య, ఎల్ రాజలింగయ్య,పి. నాగేశ్వరరావు లను ముఖ్య అతిథి డాక్టర్ సుపర్ణ, వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్, కార్నియల్ సర్జన్ డాక్టర్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
0 Comments