ఆత్మకూరు లో ఘనంగా రేవూరి జన్మదిన వేడుకలు!
అన్నదాన కార్యక్రమం
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి జన్మదిన వేడుకలకు నియోజకవర్గ,మండల యువజన కాంగ్రెస్ నేతలు సేవాదళ్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చారు. ఆత్మకూర్ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక పైన కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ముందుగా మండల పార్టీ అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, జిల్లా నాయకులు కమలాపురం రమేష్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రేవూరి రణధీర్ రెడ్డి, పరకాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ మండల అధ్యక్షులు తనుగుల సందీప్ లు ఆత్మకూరు శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దంపతుల పేరు పైన ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. ప్రజా నాయకుడైన రేవూరి ప్రకాష్ రెడ్డికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోమంత్రి పదవి లభించి నియోజకవర్గ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. పరకాల నియోజకవర్గం ఆదర్శంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న రేవూరి ప్రకాష్ రెడ్డికి దేవుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ప్రసాదించాలని కోరుకున్నారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ముద్ధం సాంబయ్య బోరిగం స్వామి మాజీ సర్పంచ్ కంచ రవి కుమార్ మాజీ పిఎస్ సిహెచ్ చైర్మన్ ఎరుకొండ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి బిసి సెల్ నియోజకవర్గ నాయకులు చిమ్మని దేవరాజ్, రేవురి జయపాల్ రెడ్డి తాళ్ల కిరణ్ కంది కమలాకర్ రెడ్డి సంగే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments