ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా బాబు లాల్

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాబు లాల్ బుధవారం     బాధ్యతలు చేపట్టారు.  2009 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి బాబులాల్ .గతంలో ఆయన గీసుకొండ, వరంగల్ ట్రాఫిక్ , టాస్క్‌ఫోర్స్ విభాగాలలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి,సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. బదిలీపై వచ్చిన ఆయనను ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు స్వాగతించారు .ఈ సందర్భంగా నూతన ఇన్‌స్పెక్టర్ బాబు లాల్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

Post a Comment

0 Comments