దళిత్ స్పీకర్ ను దుర్భాషలాడిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క్షమాపణలు చెప్పాలి


(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
*తెలంగాణ శాసనసభ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని  తీవ్ర పదజాలంతో దుర్భాషలాడి అవమానించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ని ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేసి క్షమాపణలు చెప్పాలని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ డిమాండ్ చేశారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు  సోమవారం ఆత్మకూర్ మండల  మాట్లాడారు.
పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ను కించపరిచేలా మాట్లాడి అవమానించడం అంటే రాజ్యాంగాన్ని,శాసనసభను, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ నాయకులకు దళితులు అంటే ఎందుకంత చులకన ప్రశ్నించారు. కెసిఆర్ సూచనలతోనే  తీవ్ర పదజాలంతో అవమానించారని మండిపడ్డారు. వెంటనే కెసిఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తెలంగాణ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎస్ నాయకులను గ్రామాలలో తిరగకుండా అడ్డుకుంటామని, దళిత నాయకుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఈ యొక్క సమావేశంలో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు రేవూరి జయపాల్ రెడ్డి,వార్డు సభ్యులు బయ్యా కుమారస్వామి,ఏఎంసి డైరెక్టర్ కాడబోయిన రమేష్, నియోజకవర్గ బీసీ సెల్ కోఆర్డినేటర్ చిమ్మని దేవరాజు, గ్రామ అధ్యక్షులు తాళ్ల కిరణ్, ఎలగొండ లింగమూర్తి, మాజీ సభ్యులు కాడబోయిన రవి, యూత్ నాయకులు కాడబోయిన రాజకుమార్, మహమ్మద్ కరీం, షరీఫ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి,మొగిలి,బయ్యా సురేష్,ఎలగొండ రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments