జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనాలు అందించాలని కోరుతూ సంగెం మండల ఎంపీడీఓ, తహశీల్దార్ లకు మెమోరండంను బీఆర్ఎస్ నాయకులు
అందించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశాలతో జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో* కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలను అందించాలని *సంగెం మండల ఎంపీడీఓ, తహశీల్దార్ లకు మెమోరండం అందజేసిన మండల బీఆర్ఎస్ నాయకులు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను ప్రకటించి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా అందాల్సిన ప్రయోజనాలను అందించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంగెం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments