ఆత్మకూరు లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి జన్మదిన వేడుకలు

(జై భారత్ వాయిస్ న్యూస్  ఆత్మకూరు):
: ఆత్మకూరు మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం మండల నాయకులు కార్యకర్తలు  ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల బి ఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ కేక్  కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అనంతరం వృద్ధులకు పిల్లలకు స్వీట్లను పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బొల్లోజు  కుమారస్వామి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేదల పెన్నిధి అని రైతుల బాంధవుడు అని పది కాలాలపాటు ఆయురారోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యకర్తలకు ఆపద వస్తే ముందుండి సేవలందించే మహా నాయకుడు ధర్మారెడ్డి అని ఆయన కొనియాడారు. ఆయన సేవలు పరకాల నియోజకవర్గానికి ఎప్పటికీ అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మాజీ చైర్మన్ కాంతాల  కేశవరెడ్డి మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ నత్తి సుధాకర్, ఆత్మకూరు ఉప సర్పంచి భాష బోయిన పైడి, జిల్లా నాయకులు బొల్లె బోయిన రవి యాదవ్, కొత్తగట్టు మాజీ సర్పంచ్ బోళ్ల  నరేష్, అండ్రు విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఎండి అంకుష్, సాహురే రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments