(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ):
ఉద్యోగ ఉపాధ్యాయ జీవితంలో విద్యార్థులకు అంకితమై బోధించినప్పుడే సమాజంలో తగిన గుర్తింపు వస్తుందని ఉపాధ్యాయ సన్మాన అవార్డు గ్రహీత పోతరాజు కిషన్ అన్నారు హనుమకొండ లోని సామా జగన్ స్మారక భవనంలో వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పోతరాజు కిషన్ పదవీ విరమణ సందర్భంగా పూర్వ విద్యార్థుల కలయిక సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు విద్యార్థులు లక్ష్యంగా తో కష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు తాను పాఠాలు చెప్పిన వారు వివిధ రంగాలలో స్థిరపడినందుకు సంతోషంగా ఉందని చెప్పారు చిన్ననాటి క్రమశిక్షణ ఎదుగుదలకు కారణమవుతుందని అన్నారు. పిల్లలు సోషల్ మీడియా ప్రభావం, ఆ ఉచ్చు లో పడి నష్ట పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సన్మాన గ్రహీత పోతరాజు కిషన్ కు పాదపూజ నిర్వహించారు. కిషన్ విజయ దంపతులను పూల గజ మాల తో సత్కరించారు సందర్భంగా రంగాపురం హై స్కూల్ హెడ్మాస్టర్ యాకూబు రెడ్డి మాట్లాడుతూ నీరు కుళ్ళ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కిషన్ తమ పిల్లలను ఉన్నత స్థాయిలో ఐ ఏ స్ హోదాలో తీర్చి దిద్దార నీ అన్నారు. ఇంకా కార్యక్రమంలో రంగా పురం స్కూల్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి, మనుబోతులగడ్డ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకాని అశోక్,
కేంద్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్, ఆరోగ్యదర్శిని ఎడిటర్ పెరుమాండ్ల వెంకట్, పేరుక సంఘం నగర అధ్యక్షుడు అజయ్ వర్మ ,ఎస్జిటి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు పోతరాజు మురళి, శాయంపేట ఏఎస్ ఓ మేడ ప్రవీణ్ తదితరులు శాలువాల తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రముఖ డాక్టర్ మహ్మద్ అజిత్,పాండవుల సురేందర్ మౌనిక, ఇంకా విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. కిషన్ తనయులు కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టర్ హరి ప్రసాద్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివ ప్రసాద్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
0 Comments