శ్రీకృష్ణ టెంపుల్ ఆవరణలో మొక్కలు నాటిన పంచాయితీరాజ్ ఉద్యోగులు

జై భారత్ వాయిస్ న్యూస్: వరంగల్ 
పర్యావరణ పరిరక్షణకు, మానవ మనుగడకు  ప్రతి ఒక్కరు విధిగామొక్కలు నాటాలని సంగెం మండల ఎంపిఓ హర్షిత్ అన్నారు. సంగెం మండలంలోని నార్లవాయి గ్రామం  శ్రీకృష్ణ టెంపుల్ ఆవరణంలో గురువారం నాడు మండల ఎంపిఓ,నార్లవాయి గ్రామ సర్పంచ్  సింగిరెడ్డి అనిల్ రాజు,గ్రామ పంచాయితీ కార్యదర్శులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపిఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణతోపాటు గుడి బడి ఆవరణలో మొక్కలు నాటాలని దేవాలయం ఆవరణలో పండ్ల మొక్కలు,నూల మొక్కలు నాటాలని దీంతో దేవాలయంకు వచ్చ భక్తులు ఆద్యాత్మీక భావంతో పాటు ఆహల్లదం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  దుగ్గొండి మండల ఎంపిడిఒ కార్యాలయ  సూపరింటెండెంట్ రవికుమార్,సీనీయర్ అసిస్టెంట్ రాజ్ కుమార్ మండల పంచాయతీ కార్యదర్శిల ఫోరం అధ్యక్షులు శరత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్  రవీందర్  గ్రామ పంచాయితీ కార్యదర్శులు రమేష్,రాజ్ కుమార్, యాదగిరి, సుభాష్‌, దినేష్, శ్రీలక్ష్మీ అనూష రోహిణి, సుమలత, రాజు దామెరుప్పుల అశొక్  పాల్గొని మొక్కలు నాటారు

Post a Comment

0 Comments