(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామిఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభ మయ్యాయి. ఆలయంలో ధ్వజారోహణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వంశ పారంపర్య అర్చకులు ఆరుట్ల మాధమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు డింగరి శ్రీరామా చార్యులు , కప్పి స్వామి, ఆదిశేష స్వామి వేదమంత్రోచ్ఛారణల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్య క్రమాలు భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి.ఉదయం వేళ పుణ్యవచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం యాగశాల ప్రవేశం, అంకురారోపణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక మంత్రోచ్ఛారణల మధ్య గరుడ ముద్దతో ధ్వజారోహణం నిర్వహించగా, ఆలయ ప్రాంగణం “గోవిందా గోవిందా” నినాదాలతో మార్మోగింది. సాయంత్రం వేళ భేరీ పూజ, దేవత ఆహ్వానం, హోమం, బలిహరణం వంటి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ప్రతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించబడగా,పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు పుష్పాలతో అలంకరించబడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరగనున్నదని అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అర్చకులు కోరారు.ఈకార్యక్రమంలోశ్రీవేణుగోపాలస్వామి భజన మండలి టింగిలికారి సత్యనారాయణ, వికాస తరంగిణి అధ్యక్షులు పోలు రాజేష్ కుమార్, నాగ బండి శివప్రసాద్, పాపని రవీందర్, మునుకుంట్ల సతీష్, పరికిరాల వాసు, అల్వాల రవి, రేవూరి దేవేందర్ రెడ్డి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments