Ubuntu service ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితునికి అండగా నిలిచిన ఉబుంటు టీం

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)
  వరంగల్ జిల్లా, గీసుకొండ మండల కేంద్రానికి చెందిన షేక్ అంకూస్ పాషా (షరీఫ్) అనే నిరుపేద ఆటోడ్రైవర్, గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎలాంటి ఆదాయం లేని కుటుంబం కావడంతో, అతని  మందులకే కాకుండా కుటుంబ పోషణకు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయిన "ఉబుంటు టీం" అతనికి అండగా నిలిచి, ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించగా అ నగదు రూపాయలను గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగొని రాజు కుమార్, మనుగొండ గ్రామ సర్పంచ్ పేర్ల శ్రవణ్ చేతులమీదుగా బాధితునికి అందజేశారు. ఈసందర్భంగా స్థానిక సర్పంచ్ వీరగొని రాజు కుమార్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న తమ గ్రామానికి చెందిన వ్యక్తికి ఆపన్నహస్తం అందజేసినందుకు ఉబుంటు టీం వారికి ధన్యవాదాలు తెలిపారు. విద్య, వైద్యం, పేదరికం వంటి కొన్ని  సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషిచేస్తున్న *ఉబుంటు టీం* కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఉబుంటు టీం ప్రతినిధులు కర్ణకంటి రాంమూర్తి,మండ నవీన్, స్థానిక నాయకులు దౌడు సునీల్, దౌడు రాజు, పొగాకు బిక్షపతి, రాగిరి రాజేందర్ మరియు ప్రముఖ సోషల్ మీడియా వారియర్ బానోత్ రేవంత్ రాథోడ్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments