గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు): 
గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని గో ఆరాధన ఉద్యమ ప్రతినిధి ఇరుసడ్ల సదానందం అన్నారు.గో ఆరాధన దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రికి తహశీల్దార్.  కార్యాలయం ద్వారా గో ప్రేమికులు వినతి పత్రాలు అందించారు. డిప్యూటీ తహశీల్దార్ భాస్కరమూర్తికి వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గో సేవ కొరకు కేంద్ర చట్టం మరియు గో సేవా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. గో పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి ,వికాస తరంగిణి జిల్లా కార్యవర్గ సభ్యుడు సీనియర్ జర్నలిస్టు పోలు రాజేష్ కుమార్, బిజెపి ప్రధాన కార్యదర్శి బయ్య పైడి ఆచార్య ఉప్పునూతల శంకర్ జి, భాష బోయిన సాగర్, గుండెబోయిన కుమార్, పైడి, బూర దశరథం, పులిచేరి.పైడి, పెరుమాళ్ళ స్వామి, సంగే కుమారస్వామి, టెంకుకురాల రామారావు, మంద రవి, కాటబత్తిని శీను, కొర్నెల్, చంద్రమౌళి,  గో ఆరాధకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments