మత్తు పదార్థాలకు యువత దూరం గా ఉండాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
 ఆత్మకూరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా మాదక ద్రవ్యాల పట్ల యువత దూరంగా ఉండాలని సి ఐ  సంతోష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా  మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నీ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సిఐ ఆర్ సంతోష్ యువతకు అవగాహన కల్పించారు. యువతతో ప్రతిజ్ఞ చేయించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం  జీవితాన్ని కాపాడుకుందాం అంటూ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసు కోవద్దని అన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనీ అన్నా రు . పరిసరాల్లో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, సేవిస్తున్నా వెంటనే పోలీస్ కు సమాచారం ఇవ్వండి అని సీఐ ఆర్ సంతోష్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. యువతకు వాలీబాల్, వాలీబాల్ నెట్ అందించి యువతతో కాసేపు క్రీడలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments