యూనియన్ బ్యాంకులో భీమా చెక్కు పంపిణీ

(జై భారత్ వాయిస్ న్యూస్  ఆత్మకూరు ): ప్రధాన మంత్రి జీవన్ భీమా యోజన పథకం  తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ మునివర్మ అన్నారు 
యూనియన్ బ్యాంకు లో ఖాతా కలిగి 436/- రూపాయల ప్రధానమంత్రి జీవన్ భీమా యోజన పథకంలో చేరిన సభ్యులకు సాధారణ మరణం చెందిన సభ్యుల యొక్క కుటుంబానికి ఆర్థికంగా భరోసా కలిగించిన నీరుకుల్ల యూనియన్ బ్యాంక్ ఖాతా కలిగిన వెన్నపురెడ్డి రాణి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం పొందారని అన్నారు.  లబ్ధిదారులకు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మునివర్మ చేతుల మీదుగా రెండు లక్షల చెక్కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ నీలేష్ కృష్ణవేణి సురేష్ రెడ్డి అభిలాష్ కుమార్ స్వామి ,బ్యాంకు మిత్ర కోటిలింగాచారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్  మాట్లాడుతూ రు. 436  స్కీం మరియు రు.20 ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేసుకోవాలని అన్నారు.

Post a Comment

0 Comments