ఆత్మకూరు లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు వెల్దే లక్ష్మణ్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను వివరించారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఫోటోగ్రఫీకి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. సమాజంలో చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఒక ఫొటో ఒక  సంఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను భవిష్యత్ తరాలకు అందించే విలువైన ఆధారంగా నిలుస్తుందని తెలిపారు. వార్తా రంగంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో ఫోటోగ్రాఫర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు నూతన నైపుణ్యాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వెల్దే లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కక్కెర్ల కమలహాసన్, ఉపాధ్యక్షులు ఓదెల సదానందం, పైడి, కోశాధికారి వెల్దే మహేందర్, సభ్యులు కోటి, శ్రీను, రాజేష్, అఖిల్, వినయ్, వెంకటేశ్వర్లు, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments