( జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండల కేంద్రంలోని మోడల్ కాలనీలో వినాయక నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మోడల్ కాలనీలో ఏర్పాటుచేసిన శ్రీ గణపతి దర్శించుకోవడానికి మహిళలు భక్తులు తరలివచ్చారు. గణపతి దేవునికి పురోహితులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ కన్వీనర్ పడాల భాస్కర్ మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుంచి ఈ కాలనీ లో గణపతి విగ్రహాన్ని ప్రతి ఏటా ఏర్పాటుచేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అతి చిన్న గణపతి విగ్రహం ఏర్పాటుతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ కాలనీలో పెద్ద విగ్రహం ఏర్పాటు వరకు వచ్చిందని అన్నారు. కాలనీ సభ్యుల సహకారంతో ప్రతి ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం గణేష్ విగ్రహాన్ని పోలీసు ఉద్యోగి బొల్లెపల్లి ప్రతాప్ కొనుగోలు చేసి అందించడం జరిగిందని అన్నారు .భక్తి తత్వాన్ని పెంపొందించడానికి ఉత్సవాన్ని చేపట్టామని అన్నారు. కాలనీలోనే ప్రతి సభ్యుడు ఈ ఉత్సవంలో పాల్గొని ఉంటూన్నారని చెప్పారు. బుధవారం మహిళలు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు బూర సతీష్ ,పోగాకుల రమేష్ , కాకాని అశోక్,ఎరుకొండ రవి, బొల్లెపల్లి ప్రతాప్ ,తిప్పారపు రవి ,మార్కండేయ, తదితరులు పాల్గొన్నారు
0 Comments