(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )బి ఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లి, పెద్దాపూర్, పెంచికలపేట తిరుమలగిరి గ్రామాలలో ఇటీవల మృతిచెందిన మాజీ వార్డు సభ్యులు అప్పని రాజీరు, బింగి రాజయ్య, చాపర్తి సమ్మయ్య, కందకట్ల మధుసూదన్,మందపెల్లి సూరయ్య, బిఆర్ఎస్ నాయకులు రమేష్, సాంబయ్యల తండ్రి నారాయణ ల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి మృతికి గల కారణాలను మృతుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నీరుకుల్ల గ్రామ బిఆర్ఎస్ నాయకుడు పిట్టల ప్రభాకర్ ను పరామర్శించి, తన ఆరోగ్య పరిస్థితి నీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తలు తన కంటికి రెప్పలా కాపాడుకుంటానని, వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి, సర్పంచులు మందపెల్లి మరియా ప్రసాద్, తడకనీరజ శ్రీనివాస్, మాజీ మార్కెట్ డైరెక్టర్ కాంతాల కేశవరెడ్డి, మాజీ సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments