తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) తెలంగాణ ప్రజల చారిత్రక పోరాటాన్ని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఉప్పుగల్ల శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనమైన, చారిత్రక ఘట్టాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నిజాం బాధితులు,రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొన్న ప్రజలు, అమరులైన వీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లను ప్రస్తావించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి.ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాతో పాటు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించా లని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన మ్యూజియం ఏర్పాటు చేయాలనీ ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచన స్మృతి కేంద్రాలు ఏర్పాటు చేసి చరిత్రను భావితరాలకు తెలియజేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలనీ రజాకార్ల దౌర్జన్యాలకు గురైన కుటుంబాలను గుర్తించి, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేసే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ బీజేపీ ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన స్మారక చిహ్నం ఏర్పాటు చేసి, తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు,పుస్తకాలు, ఫోటోలు, వివరాలను భద్రపరచాలని,తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్, గురిజాల శ్రీరామ్ రెడ్డి, ఆర్టీఐ  యాక్ట్ జిల్లా కన్వినర్ ఎదులాపురం శ్రవణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు ఇర్సండ్ల సదానందం, ప్రధాన కార్యదర్శి రవ్వ శివప్రసాద్, మామూనూరి శ్రీనివాస్, పోరెడ్డి ప్రదీప్ రెడ్డి,జక్కుల మహేందర్, దినేష్,సునీల్ రెడ్డి,,వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments