జాతీయ రహదారి పై నీరుకుళ్ల క్రాస్ వద్ద వంటావార్పుతో నిరసనలు
"నీరుకుళ్ళకు కెటాయించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను పెద్దాపురం తరలించ వద్దు"
"మా బడి మాకే కావాలి" అంటూ నినాదాలు
-జాతీయ రహదారి పైకి వెళ్లకుండా ప్రజలను నిరోధించిన పోలీసులు
-వంట వార్పు కార్యక్రమాల తో నిరసన తెలిపిన ప్రజలు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం వంట వార్పు కార్యక్రమం నిర్వహించి పలు గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. గ్రామానికి కేటాయించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను యథాతథంగా నీరుకుళ్ళ లోనె కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నీరుకుళ్ల, పెంచికలపేట, కేశవాపూర్ గ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా నీరుకుళ్ల క్రాస్ వద్ద వంటా-వార్పు నిర్వహించి ప్రభుత్వానికి నిరసనను తెలిపారుతెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను పెద్దాపూర్ గ్రామానికి తరలించే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. , "మా బడి మాకే కావాలి", "పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు", "గ్రామానికి మంజూరైన పాఠశాలను తరలించవద్దు" అంటూ పెద్దఎత్తున నినాదాలు గ్రామస్థులు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల తరలింపును అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకోనిర్వహించేందుకు నిరసనకారులు ముందుకు సాగగా, భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు . జాతీయ రహదారిపై రాక పోకల కు అంతరాయం కలుగకుండా చేశారు గ్రామానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నీరుకుళ్ల లొనే కొనసాగించాలని, ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల ప్రజలు , జడ్పీఎస్ఎస్ నీరుకుల్లా పూర్వ విద్యార్థులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


0 Comments