జై భారత్ వాయిస్ గీసుకొండ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా – వానాకాలం 2026 పథకం కింద అర్హులైన రైతులందరూ తమ బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్లు ఇతర వివరాలను జూలై 05, 2026 లోపు తప్పనిసరిగా నవీకరించుకోవాలని గీసుగొండ మండల వ్యవసాయ అధికారి పి. హరిప్రసాద్ బాబు కోరారు.ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి పన్నెండువేల రూపాయాల పెట్టుబడి సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేయనున్నట్లు తెలిపారు.
రైతులు తప్పనిసరిగా చేయాల్సినవి
1. గత సీజన్లలో సాంకేతిక కారణాలతో రైతు భరోసా సొమ్ము అందని రైతులు.
2. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు.
3. గత నాలుగు సీజన్లుగా బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయని పాత పట్టాదారులు.
వీరందరూ తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ను సంప్రదించి వివరాలు నమోదు చేయించుకోవాలి.
సమర్పించాల్సిన పత్రాలు
1. పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్
2. బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ లేదా Cancelled cheque, అవసరమైతే మొబైల్ నంబర్ వివరాలు
రైతులు వెంటనే తమ మొబైల్ నంబర్లను సరిచేయించుకోవాలి.
1. మొబైల్ నంబర్ నమోదు చేయని వారు.
2. తప్పు మొబైల్ నంబర్ నమోదు అయిన వారు.
3. ఒకే మొబైల్ నంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లు లింక్ అయిన వారు.
AEO నమోదు చేసిన వివరాలను 24 గంటల్లోపు మండల వ్యవసాయ అధికారి ధృవీకరించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఆలస్యం చేయకుండా వివరాలు అందజేయాలి.బ్యాంక్ ఖాతా వివరాల సవరణ మరియు నవీకరణకు చివరి తేదీ: 05 జూలై 2026 గడువులోగా వివరాలు నమోదు చేయని రైతులు ఈ సీజన్ రైతు భరోసా బిల్లుల సమర్పణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
AEOల సంప్రదింపు వివరాలు:
1. గీసుగొండ క్లస్టర్ – ఏఈఓ ఎం. కావ్య
📞 9281008284
2. ధర్మారం క్లస్టర్ – ఏఈఓ ఎం. కావ్య
📞 7671875558
3. ఎలుకుర్తి హవెలి క్లస్టర్ – ఏఈఓ పి. స్మిత
📞 9959799448
4. మొగిలిచర్ల క్లస్టర్ – ఏఈఓ రాజేష్
📞 9281008288
5. విశ్వనాధపురం క్లస్టర్ – ఏఈఓ అఖిల
📞 7842588366
అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గడువులోగా తమ క్లస్టర్ AEOను సంప్రదించి వివరాలను ధృవీకరించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

0 Comments