డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి
-విద్యార్థుల ర్యాలీ మానవహారం, ప్రతిజ్ఞ
-సీఐ సంతోష్
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ వంతు కృషి చేయాలని ఆత్మకూరు సిఐ ఆర్ సంతోష్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మారకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు మండల కేంద్రంలో ఆత్మకూరు పోలీసుల ఆధ్వర్యంలో సెయింట్ థెరిసా పాఠశాల విద్యార్థులు పాఠశాల నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించరు. డ్రగ్స్ మాతృపానియాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం 163 జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిఐ సంతోష్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో యువత మత్తు కు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగించినట్లయితే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోపియంగా ఉంచుతామన్నారు. మాదకద్ర వేల వాడకం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు తిరుపతి లక్ష్మీనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments