(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించా లని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావడంతో పాటు, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా కీలకమని, ప్రతి ఓటరికి తన హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమని తెలిపారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి సి ఐ సంతోష్, సర్పంచ్ మహేశ్వరి రాజు, పలువురు బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.
.jpeg)
.jpeg)
0 Comments