ప్రగతి సింగారం లో ఘనంగా మే డే వేడుకలు



(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)  హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారంలో మే డే వేడుకలు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భవన నిర్మాణం కార్మిక సంఘం అధ్యక్షుడు మోరే మహేందరు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు అందేలా  చూడాలని డిమాండ్ చేశారు ప్రతి కార్మికునికి వ్యక్తిగత రుణ సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మేడే వేడుకలలో ఎర్రజెండాను ఆవిష్కరించారు అనంతరం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘం కార్మిక సంఘం అధ్యక్షులు మో రే మహేందర్, ఉపాధ్యక్షులు లోకలవేణ రాజు, కార్యదర్శి బల్ల పాణి కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments