శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో భజన మండలి పాత్ర కీలకం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి పేరుతో ప్రారంభమైన భజన మండలి  శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాలలో కీలకపాత్ర వహిస్తున్నది. భజన మండలి ఉత్సవాలలో పాటలు పాడుతూ ఉంటేనే శోభాయమానంగా మారుతున్నది గత 60 ఏళ్ల కింద ప్రారంభించిన శ్రీవేణుగోపాలస్వామి భజన మండలి నేటికీ ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామికి ప్రతి ఏట నిర్వహిస్తున్న ఉత్సవాలలో భజన పాటలతో భక్తితో కొలుస్తారు.ప్రతి శనివారం భజన కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వామివారికి భక్తి పాటలను పాడుతారు భక్తజన మండలితో ప్రారంభమైన వేణుగోపాలస్వామి భజన మండలి గూడెప్పాడు తదితర ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించి భజనలను చేస్తున్నారు.ఇటీవల నిర్వహించిన శ్రీ వేణుగోపాలస్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలలో ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు భజన మండలి కీలకపాత్ర వహించింది. ఈ ఉత్సవాలలో భజన భక్తులు వాలంటరీ గా సేవలు అందించారు.భజన మండలిని గత 60 ఏళ్ల కింద అర్చకులు ఆరుట్ల వెంకటాచార్యులు, మండ వెంకటయ్య విలాసాగరపు ఎల్ల గౌడ్ , బూర వెంకటె శ్వరు, తదితర పెద్దలు ప్రారంభించారని భజన మండలి అధ్యక్షుడు పరికరాల వాసు తెలిపారు ఈ భజన మండలి సభ్యులు మునుకుంట్ల సతీష్, మాజీ జెడ్పీటీసీ టింగ్లి కార్ సత్యనారాయణ, ఆలయ అర్చకులు ఆరుట్ల మాధవా చార్యులు ఆధ్వర్యంలో భజన చేస్తున్న భక్తులు ప్రతి రెండవ శనివారం భజన విష్ణుసహస్ర నామ పారాయణం నిర్వహిస్తారని తెలిపారు. ధనుర్మాస ఉత్సవాలను నిర్వహించే పాశురాలను పాడుతూ గోదాదేవి కల్యాణంలో శ్రీనివాసుని కీర్తిస్తారని చెప్పారు. వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న భక్తి కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ దేవదేవుని కీర్తిస్తూ భక్తి భావం పెంపొందిస్తున్నామని ఆయన వివరించారు నాడు ప్రారంభించిన భజన మండలి నేడు నడుస్తున్నది. పతి ఏట శ్రీరామ నవమి ఉత్సవాలలో కూడా భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments