గుడెప్పాడ్ లో చలివేంద్రం ప్రారంభం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
ఆత్మకూరు మండలం కామారం వరసిద్దు వాటర్ ప్లాంట్   ఆధ్వర్యం లో  గుడెప్పాడ్ జంక్షన్ లో చలివేంద్రం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడెప్పాడ్ , కామారం గ్రామ సర్పంచులు పరికి రమేష్ బాబు, తోట కుమారస్వామి పాల్గొని ప్రారంభించారు. అనంతరం గుడెప్పాడ్ సర్పంచ్ పరికి రమేష్ బాబు మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలని ఆలోచన రావడం అభినందించదగ్గ విషయమని, ఇంతటి మండు టెండల్లో ప్రయాణికుల సౌకర్యార్థం వరసిద్దు వాటర్ ప్లాంట్ ఆధ్వర్యం లో చలివేంద్రం ఏర్పాటు మంచి విషయం  అన్నారు .కామారం గ్రామ సర్పంచ్ తోట కుమారస్వామి  మాట్లాడుతూ గుడెప్పాడ్  జంక్షన్ లో రోజు వేల మంది ప్రయాణికుల ప్రయాణిస్తారని వారి దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం పెట్టడం మంచి ఆలోచన అని అన్నారు. అనంతరం వరసిద్దు వాటర్ ప్లాంట్ నిర్వాహకులు బూర వరుణ్ గౌడ్,  మాట్లాడుతూ గుడెప్పాడ్ గ్రామపంచాయతీ వారి సహకారంతోనే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేస్తామని తెలపారు. ప్రయాణికులు చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల చల్లటి నీళ్లుతాగుతూ సంతోషం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments