ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవూరి జలంధర్ రెడ్డి

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ) 
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రేవూరి జలంధర్ రెడ్డిని పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు.  కాంగ్రేస్ కుటుంబం నుంచి వచ్చిన జలంధర్ రెడ్డి నియామకంతో స్థానికులు, పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన రేవూరి  జలంధర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి , జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి , మండల ప్రజా ప్రతినిధులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం  అహర్నిశలు కష్టపడతానని, కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నాకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments