ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని కలిసిన నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను గౌరవపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన సందర్భంగా మాట్లాడారు మండల కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అంకితమై పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసికట్టుగా పనిచేసి మంచి పేరు తేవాలని కోరారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు 
రేవూరి జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచనల మేరకు పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మెలిసి పనిచేస్తానని అన్నారు. గ్రామాలలో కాంగ్రెసు కార్యకర్తలు విబేధాలు లేకుండా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపేందుకు కృషి చేయాలని అన్నారు. మండలాన్ని అభివృద్ధి కి కృషిచేసేందుకు ప్రతి కార్య కర్త సహకరించాలని కోరారు

Post a Comment

0 Comments