ప్రతి రోజూ యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చనని వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా అన్నారు.గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వేసవి యోగ శిక్షణ కార్యక్రమాన్ని చంద్రశేఖర్ ఆర్యా బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖిలా వరంగల్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కేడల జనార్థన్ హాజరైనారు. ఈ సందర్భంగా యోగ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ టీవీలు మొబైల్ ఫోన్లకు పక్కన పెట్టి ప్రతిరోజు యోగ సాధన చేయాలని సూచించారు. ఖిలా వరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ కేడల జనార్దన్ మాట్లాడుతూ ప్రాచీన యోగను నేడు దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరితో సాధన చేయిస్తూ నేడు ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం కృషి చేశాడని అలాంటి యోగాను ప్రతి ఒక్కరూ యోగ క్లాసులో నేర్చుకున్న యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు బొలిశెట్టి కమలాకర్ మాట్లాడుతూ రంగశాయిపేటలో ప్రతి వేసవి కాలంలో యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ శిక్షణలో శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయస్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆర్య డైరీలు పెన్నులు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్ , పాష, యోగ అసోసియేషన్ కోశాధికారి సాంబశివరావు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు దామోదర్ రవికుమార్ ప్రవలిక, యోగ శిక్షకులు కోట రజిత ,జ్యోతి, అభినవ నేతాజీ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments