అంగరంగ వైభవంగా రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండల కేంద్రంలో- రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం అయింది. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆవరణలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ, కంట మహేశ్వర, సురమాంబ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ఉదయం విగ్రహాలను వాడవాడలా వేద పండితుల ఆధ్వర్యం పూజలు నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నీళ్లు ఆరగిస్తూ పసుపు కుంకుమ, వేస్తూ కొబ్బరికాయలు కొడుతూ మనసారా వేడుకున్నారు. ఈ ఉత్సవానికి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఆత్మకూరు సర్పంచి పర్వతగిరి మహేశ్వరి రాజు, గౌడ సంఘం ఆలయ నిర్మాణ కమిటీ బృందం పొగాకుల కొమురయ్య, పొగాకుల రమేష్, గుర్రం ప్రభాకర్, వల్లాల రాజు, బూర మహేందర్, బైగాన్ని రమేష్ లు కొబ్బరికాయలు కొట్టి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 108 గుండాలలో 108 దంపతుల చేత గణపతి హోమం, మృత్యుంజయ హోమం వేద పండితుల బృందం వేద మంత్రాలతో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  సాయంత్రం మహాలక్ష్మికి కుంకుమ పసుపు అభిషేకాలను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పూజలో పాల్గొన్నారు

Post a Comment

0 Comments