రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేందుకు మాక్ డ్రిల్



 రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేందుకు మాక్ డ్రిల్

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):

ఆత్మకూరు మండలంలోని గూడెపాడ్ సెంటర్‌లో శుక్రవారం సీఐ సంతోష్ ఆధ్వర్యంలో రహదారి ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, గాయపడిన వారికి ఎలా ప్రథమ చికిత్స అందించాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అరేవ్ అలేవ్ నాలుగో దశ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ప్రమాదాల్లో గాయపడిన వారికి కార్డియో పల్మనరీ రెస్పిటేషన్ (సీపీఆర్) విధానం ద్వారా ప్రాణాలు ఎలా కాపాడవచ్చో పోలీసు అధికారులు ప్రదర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం ఎంతో కీలకమని, తొలి గంటను గోల్డెన్ హావర్ అని పిలుస్తారని తెలిపారు.ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహావీర్ స్కీం  మరియు పీఎం రాత్ స్కీం పథకాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వాహనదారులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments