ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితునికి అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)
  గీసుకొండ మండల కేంద్రానికి చెందిన షేక్ అంకూస్ పాషా షరీఫ్ అనే నిరుపేద వ్యక్తి, వృత్తి రీత్యా ఆటోడ్రైవర్ రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని దయనీయ పరిస్థితిని గమనించిన అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్,గీసుకొండ గ్రామ సామాజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ మానవత్వంతో స్పందించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పంపగా అట్టి నగదును గీసుకొండ సోషల్ సర్వీస్ టీం ప్రతినిధులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మహ్మద్ సోనీ, కత్తి వెంకటేశ్వర్లు మరియు బోడకుంట్ట ప్రభాకర్ బాధితునికి అందజేయడం జరిగింది. ఆపదలో ఉన్న తమకు అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మీనారాయణకి అంకూస్ పాషా ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments