అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం

గీసుకొండ మండలం రాంపూర్  గ్రామపంచాయతీ పరిధిలో గల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా గీసుకొండకు చెందిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ తమ ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు.గతంలో ఆలయ నిర్మాణానికి రూ.100116 విరాళం అందించిన ఆయన, ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన కోసం 1,00,116 రూపాయలను రాంపూర్ గ్రామ సర్పంచ్ రడం భరత్, తాబేటీ వెంకటేశ్వర్లులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ రడం భరత్,గుడి చైర్మన్ తాబేటీ వెంకటేశ్వర్లు గ్రామ ప్రజల తరఫున లక్ష్మీనారాయణకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆయన అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సూర్య తండ సర్పంచ్ బానోతు రాఘవేంద్ర ,బోనాల అశోక్ దర్శనాల రాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments