జై భారత్ వాయిస్ న్యూస్ సాంబశివరావు)
భారత స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఆనాటి మన నాయకులు భారతీయ సంప్రదాయ వస్త్ర వారసత్వాన్ని సంరక్షించడం. ప్రధాని నరేంద్ర మోడీ చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు
1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం జ్ఞాపకార్థంగా
భారత ప్రభుత్వం 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా జూలై లో కేంద్ర ప్రభుత్వః ప్రకటించింది.ఈ తేదీని ఎంపిక చేశారు.మొదటి వేడుక చెన్నైలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆనాటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత దినోత్సవం ప్రతి ఏడాది ఆగస్టు 7న ఘనంగా జరుపుతూ చేనేత కుటుంబాలను గౌరవిస్తుంది చేనేత కుటుంబాల కోసం అనేక పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నేతన్నల సంక్షేమం కోసం అమలు చేస్తున్నాయిదేశ ప్రజలు వారంలో ఒకసారి చేనేత వస్త్రాలను ధరించి వారికి చేయుత అందిద్దాం.....
నేతన్నల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం... తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి 25 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఆగస్టు 7వ తేదీన ‘12వ జాతీయ చేనేత దినోత్సవం’ను పురస్కరించుకుని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి 25 వేల రూపాయలు సహాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు 179 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందించనుంది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో సర్కారు సాయం అందిస్తోంది.
*చేనేత రంగం బలోపేతం దిశగా...*
తాజాగా ప్రవేశపెడుతోన్న నేతన్న సేవలో పథకమే కాకుండా ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కల్పిస్తోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చు కానుంది. అంతేకాకుండా 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.
*ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 7న పర్యటన వివరాలు*
చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి 10.50 గంటలకు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు.
చేనేతలకు అండగా ప్రజా ప్రభుత్వం
నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు*
*జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిధులు విడుదల చేయనున్న సీఎం*
*రూ.179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి*
*నేతన్న కుటుంబాలతో ముఖాముఖి కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*
*అమరావతి, ఆగస్టు 6 :-* నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం... తాజాగా వారి సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. 7వ తేదీన ‘12వ జాతీయ చేనేత దినోత్సవం’ను పురస్కరించుకుని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు రూ.179 కోట్లను ప్రభుత్వం అందించనుంది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో సర్కారు సాయం అందిస్తోంది.
*చేనేత రంగం బలోపేతం దిశగా...*
తాజాగా ప్రవేశపెడుతోన్న నేతన్న సేవలో పథకమే కాకుండా ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కల్పిస్తోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చు కానుంది. అంతేకాకుండా 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.
*ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు*
చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి 10.50 గంటలకు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు. కొత్తపేటలో 04.10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 04.45 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
0 Comments