(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)కాకతీయుల కు పూర్వము ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ చెరువు పరిసరాల లో స్వయంభువు గా వెలసిన బ్రహ్మసూత్ర సహిత శ్రీ సిద్ధ లింగేశ్వర దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని దేవాలయ నిర్మాణానికి కమిటీ చైర్మన్ వెన్నపు రెడ్డి రాజిరెడ్డి, నిర్మాణ కమిటీ సభ్యులు తాటిపర్తి మోహన్ రావు, దగ్గు సమారావు,లక్కరుసు రాజశేఖర్ లు అన్నారు. దేవాలయ నిర్మాణ పనుల పర్యవేక్షిస్తున్న సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంభువుగా వెలసిన శ్రీ సిద్ధ లింగేశ్వరునికి తాత్కాలిక దేవాలయంలో భక్తులు కొలుస్తున్నారని తెలిపారు. దేవాలయ నిర్మాణంలో అనేకమంది భక్తుల పాల్పంచుకుంటున్నారని వారు వివరించారు దేవాలయాన్ని శిఖర భాగం వరకు పూర్తయిందని ఇంకా ధ్వజస్తంభ నిర్మాణము ఆలయ నిర్మాణం ఇంకా మిగిలి ఉన్నదని చెప్పారు ఆలయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వారు అన్నారు. ఇంకా ఈ ఆలయ నిర్మాణాన్ని వరంగల్ దేవాదాయశాఖ డిఇ చిమ్మని రమేష్ బాబు సందర్శించారని వారు వివరించారు. ప్రతి సోమవారం రోజున అభిషేక పూజలు నిర్వహిస్తున్నామని భక్తులు పూజలలో పాల్గొని తరించాలని ఆలయ పూజారి వడ్డేవరం గోపినాథ్ శర్మ అన్నారు. తాత్కాలిక ఆలయంలో నిత్యం పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు.

0 Comments