ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోరాటం తెలంగాణ ప్రజలు మరువలేనిది

- (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
- ప్రత్యేక తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన పోరాటం మరువ లేనిదని ఉద్యమకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆత్మకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో  ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జయశంకర్  విగ్రహానికి పూలమాలవేసి స్మరించుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్సడ్ల సదానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంతో పని చేసిన మహా గొప్పవ్యక్తి నీ తెలంగాణ ప్రజలు మరిచిపోరు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జయశంకర్ సారు గ్రామాన్ని  అక్కంపేటను దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అని అన్నారు.  అక్కంపేట లో భారీ పరిశ్రమ ను ఏర్పాటు చేసి స్థానిక విద్యా వంతు లకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరారు ఈ కార్యక్రమంలో మండల ఉద్యమ కారుల ఫోరం మండల అధ్యక్షలు ఎండి బాబుమియా (చిరు) మండల ప్రధాన కార్యదర్శి దొంక దువ్వ రాజయ్య, గ్రామ అధ్యక్షులు బాష బోయిన సాగర్, బలభద్ర కిషోర్, తొగరు రవీందర్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, లక్కర్స్ లింగమూర్తి, నత్తి దేవేందర్, తనుగుల జంపయ్య జన్నారపు నరేష్,  జన్నారపు యాకుబు, ఇనుగాల యాకూబ్, మేడ రామస్వామి, పులిసేరి పైడి, దరువురి కుమార్ ,తూడి కళ్యాణ్ ,పార్శ రాములు ,వడ్డేపల్లి కోటయ్య,  కాట్రేవుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments